ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎవరబ్బా ఈ అందాల చిన్నది?

Mon, Jul 11, 2016
ఎవరైనా సరే తమ చిన్ననాటి ఫోటోలను చూసుకుని ఆనందిస్తుంటారు .. ఇతరులకి చూపించి మురిసిపోతుంటారు. ఓ అందమైన జ్ఞాపకంగా చిన్ననాటి ఫోటోలు మిగిలిపోతుంటాయి. అనిర్వచనీయమైన అనుభూతులను అందిస్తుంటాయి. అందుకే ఓ అందాల కథానాయిక తన ట్విట్టర్ లో చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేసింది.

అన్నయ్యతో కలిసి ఆడుకుంటోన్న ఈ చిన్నారిని చూస్తే, ఆ కథానాయిక ఎవరో పోల్చుకోవడం కాస్తంత కష్టమైన పనే. ముద్దులొలుకుతోన్న ఈ చిన్నారి ఎవరో కాదు .. హన్సిక. వెండితెరపై పాలబొమ్మలా కనిపించే హన్సికకి, తెలుగు .. తమిళ భాషల్లో ఎంతో క్రేజ్ ఉంది. అందం .. అందుకు తగిన అభినయం కలిగిన కథానాయికగా ఆమెకి మంచి పేరుంది. అలాంటి హన్సిక చిన్ననాటి ఫోటోను చూడటం అభిమానులకి ఆనందాన్ని కలిగించే విషయమే.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)