ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మూడు పాత్రలు,ముగ్గురు హీరోయిన్లు!

Mon, Jul 11, 2016
శింబు
శింబు
కోలీవుడ్ యువ కథానాయకులలో శింబూకంటూ ఒక ప్రత్యేకత ఉంది. తన ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించడానికి ఆయన ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. ఇటీవల 'ఇదు నమ్మ ఆళు' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన, ఆ ఉత్సాహంతో మరో వైవిధ్యభరితమైన కథను ఎంచుకున్నాడు. 'అన్బానవన్ అసరాధవన్ అడంగాదవన్' (ఏ ఏ ఏ) సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన మూడు పాత్రలను పోషిస్తూ .. మూడు గెటప్స్ లో కనిపించనున్నాడు. ఆయన సరసన ముగ్గురు కథానాయికలు అలరించనున్నారు.

ఈ మూడు పాత్రల్లో ఒకటి 80వ ప్రాంతానికి చెందినదిగా ఉంటుందట. ఈ పాత్ర కోసం శ్రియను ఎంపిక చేశారు. మరో ఇద్దరు నాయికలుగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 80వ ప్రాంతానికి చెందిన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తొమ్మిది పాటలు ఉండటం మరో విశేషం. కచ్చితంగా ఇది శింబూ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మైఖేల్ రామయప్పన్ నిర్మాణంలో అధిక్ రవిచంద్రన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)