ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్వరలో సెట్స్ పైకి మాధవన్

Mon, Jul 11, 2016
మాధవన్
మాధవన్
మాధవన్ కి యూత్ లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మొదటి నుంచి కూడా ఆయన ఆ క్రేజ్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు. దాంతో ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలను యూత్ ఆదరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమిళంలో ఆయన రెండు సినిమాలను అంగీకరించాడు. మలయాళంలో భారీ హిట్ కొట్టిన 'చార్లీ' రీమేక్ లో చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక సర్గుణం దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడిగా సర్గుణానికి మంచి క్రేజ్ ఉంది. మాధవన్ కోసం ఆయన ఓ విభిన్నమైన కథను సిద్ధం చేశాడట. ఈ కథ మాధవన్ మనసు దోచుకుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరగనుందని అంటున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)