ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఖరీదైన బైక్ కొనేసిన చైతూ!

Mon, Jul 11, 2016
నాగచైతన్య
నాగచైతన్య
నాగచైతన్య యాక్టింగ్ తరువాత ఎక్కువగా బైక్స్ నే ఇష్టపడతాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త మోడల్ బైక్స్ ను గురించి ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడట. మనసుకి నచ్చిన మోడల్ బైక్ ను సొంతం చేసుకోవడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడని అంటున్నారు.

అలా 'ట్రియూమ్ప్' అనే కంపెనీ నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన 'థ్రక్స్ టన్ ఆర్' అనే మోడల్ బైక్ చైతూని ఆకర్షించింది. దాంతో ఆయన హైదరాబాద్ లోని షోరూమ్ కి వెళ్లి ఈ బైక్ ను కొనుగోలు చేశాడు. కొన్న వెంటనే చైతూ ఈ బైక్ పై సరదాగా రైడ్ చేశాడని చెబుతున్నారు. చైతూ ఓ కష్టమర్ గా తమ షోరూమ్ కి రావడం పట్ల, నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర ప్రకారం ఈ బైక్ 11 లక్షలని తెలుస్తోంది. బైక్ పై చైతూ సుదీర్ఘ ప్రయాణం చేసే సినిమాగా 'సాహసం శ్వాసగా సాగిపో' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సమయంలో, చైతూ బైక్ తీసుకోవడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)