ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ కొత్త టైటిల్ అనుష్క కోసమేనా!

Mon, Jul 11, 2016
అనుష్క
అనుష్క
రాధ ప్రేమకథ... ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అయిన కొత్త తెలుగు సినిమా టైటిల్ ఇది. దీనిని రిజిస్టర్ చేసింది యూవీ క్రియేషన్స్ సంస్థ. అయితే, ఇప్పుడీ టైటిల్ని సదరు సంస్థ ఏ సినిమా కోసం రిజిస్టర్ చేసింది అన్న విషయంలో ఆసక్తి కలుగుతోంది. ఎందుకంటే, త్వరలో ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఈ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. మరోపక్క, ఇప్పటికే అనుష్క ప్రధాన పాత్రధారిణిగా అశోక్ దర్శకత్వంలో ఈ సంస్థ 'భాగమతి' పేరిట ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది ఇప్పటికే షూటింగును ప్రారంభించుకుంది.

ఈ నేపథ్యంలో 'రాధ ప్రేమకథ టైటిల్' ప్రభాస్ కోసం కాదని కొందరు అంటున్నారు. ప్రభాస్ లాంటి హీరో చిత్రానికి అలాంటి మహిళా ప్రధానమైన పేరును పెట్టరని వారు వాదిస్తున్నారు. అనుష్కతో తీస్తున్న 'భాగమతి' టైటిల్ అంతగా క్యాచీగా లేనందున దానిని మార్చే ఉద్దేశంతోనే ఈ కొత్త టైటిల్ని రిజిస్టర్ చేశారని, అనుష్క కోసమే ఈ టైటిల్ అనీ మరికొందరు అంటున్నారు. ఏమైనా, ఈ విషయంలో సదరు సంస్థే క్లారిటీ ఇవ్వాలి!
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)