ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Mon, Jul 11, 2016
సమంతా
సమంతా
* "చిన్నప్పటి నుంచీ నాకో కోరిక వుండేది. అదేమిటంటే, జీవితంలో ప్రతి రోజు సరికొత్తగా సాగాలనేది. నా అదృష్టం కొద్దీ అలాగే జరుగుతోంది" అంటోంది చెన్నయ్ బ్యూటీ సమంతా. తాను కోరుకున్నవన్నీ తనకు అందుతున్నాయని, పైగా పెద్ద కష్టపడకుండానే అవన్నీ తన సొంతమవుతున్నాయని ఈ చిన్నది ఆనందంగా చెబుతోంది. తెలుగు, తమిళ భాషల్లో బిజీ స్టార్ గా రాణిస్తున్న సమంతా త్వరలో అక్కినేని వారింటి కోడలు కానున్న సంగతి విదితమే.
* శేఖర్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'డా.చక్రవర్తి' చిత్రం ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. హీరో శ్రీకాంత్ ఆడియో సీడీలను విడుదల చేయగా, కల్వకుంట్ల తేజేశ్వరరావు తొలిసీడీని స్వీకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్వీ కృష్ణారెడ్డి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
* శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా 'మిస్టర్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. పలుసార్లు వాయిదాల అనంతరం ఈ చిత్రం షూటింగ్ కోసం యూనిట్ స్పెయిన్ బయలుదేరి వెళ్లింది. ఈ రోజు నుంచి అక్కడ షూటింగ్ మొదలవుతుంది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)