ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జెయింట్'కి మాట ఇచ్చిన జగపతిబాబు!

Sun, Jul 10, 2016
జగపతిబాబు
జగపతిబాబు
"మొదట్లో నా సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పుకోలేకపోయాను. వేరే వాళ్లు చెప్పేవారు. ఆ తర్వాత పట్టుబట్టి కష్టపడి డబ్బింగ్ చెప్పుకోవడం మొదలెట్టాను. విశేషం ఏమిటంటే, వేరే వాళ్లకి ఇప్పుడు నేను డబ్బింగ్ చెబుతున్నాను" అంటున్నాడు ప్రముఖ నటుడు జగపతి బాబు. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్ రూపొందించిన 'ది బీఎఫ్జీ' చిత్రంలోని జెయింట్ పాత్రకు తెలుగులో జగపతిబాబు డబ్బింగ్ చెప్పాడు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ఈ విధంగా స్పీల్ బర్గ్ సినిమాలో భాగం కాగలిగే గొప్ప అవకాశం నాకు వచ్చింది. దీనిని చాలెంజ్ గా తీసుకుని డబ్బింగ్ చెప్పాను. డబ్బింగ్ పూర్తయ్యాక అది విని నేనే ఆశ్చర్యపోయాను. నాకు మంచి వాయిస్ వుందని మొదట రాంగోపాల్ వర్మ గుర్తించి, గాయం సినిమాకి డబ్బింగ్ చెప్పించారు. ఆ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చింది. అప్పటి నుంచీ నా సినిమాలకు నేనే చెప్పుకుంటున్నాను" అని చెప్పాడు. పోతే, ఈ హాలీవుడ్ చిత్రం హిందీ వెర్షన్ లో జెయింట్ పాత్రకి అమితాబ్ చెప్పగా, తమిళంలో నాజర్ డబ్బింగ్ చెప్పడం జరిగింది.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)