ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'తిక్క' నుంచి టీజర్ వచ్చేస్తోంది!

Sun, Jul 10, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా లారిస్సా బొనేసి కథానాయికగా 'తిక్క'చిత్రం రూపొందుతోంది. రోహిణ్ రెడ్డి నిర్మాణంలో సునీల్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక పాట మినహా మిగతా భాగమంతా చిత్రీకరణ జరిపారు. నాయకా నాయికలపై వచ్చే ఆ పాటను త్వరలో 'లడక్'లో చిత్రీకరించనున్నారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ నెల చివరివారంలో గానీ .. వచ్చేనెల మొదటివారంలో గాని ఆడియోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఫస్టులుక్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో, ఈ నెల 20వ తేదీన టీజర్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. రామ్ -లక్ష్మణ్ .. రవివర్మ కంపోజ్ చేసిన ఫైట్స్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ తో సాయిధరమ్ తేజ్ మాస్ ఆడియన్స్ నుంచి మరిన్ని మార్కులు కొట్టేయడం ఖాయమని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)