ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Jul 10, 2016
'100  డేస్ ఆఫ్ లవ్' లో నిత్యా మీనన్
'100 డేస్ ఆఫ్ లవ్' లో నిత్యా మీనన్
* 'ఓకే బంగారం'తో హిట్ పెయిర్ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరిద్దరూ కలసి మలయాళంలో నటించిన '100 డేస్ ఆఫ్ లవ్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ నెల 13న ఆడియోను, నెలాఖరుకి చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. మలయాళంలో ఇది సూపర్ హిట్టయిందని, తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని వారు చెప్పారు.
* మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్ర పోషిస్తున్న 'లక్ష్మీ బాంబ్' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో లక్ష్మి జడ్జి పాత్రలో నటిస్తోందని దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ తెలిపారు.
* వెంకటేష్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న 'బాబు బంగారం' చిత్రంలోని 'మల్లెల వాన...' పాటను నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడీ పాట వెంకీ అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించిన సంగతి విదితమే.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)