ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కలియుగ భీముడు'గా రానా!

Sat, Jul 09, 2016
రానా
రానా
'సుల్తాన్' గా బాలీవుడ్ లో కుస్తీ వీరుడి పాత్రను పోషించిన సల్మాన్ ఖాన్, నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. దాంతో ఆ తరహా పాత్రపై రానా మనసు పారేసుకున్నాడు. అందుకు అవసరమైన పర్సనాలిటీ ఆయనకి ఉంది కూడా. ఈ కారణంగానే ఆయన 'కలియుగ భీముడు'గా తెరపై కనిపించడమే తన డ్రీమ్ రోల్ అని చెప్పాడు.

తాజాగా రానా ఓ సందర్భంలో మాట్లాడుతూ, విజయనగరానికి చెందిన ప్రముఖ మల్లయోధుడు 'కోడి రామ్మూర్తి నాయుడు' గురించి ప్రస్తావించాడు. 'కలియుగ భీముడు' గా పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన గురించి వింటూ తాను పెరిగానని అన్నాడు. ఆయన పాత్రలో నటించాలని ఉందని చెప్పాడు. ఈ నేపథ్యంలో రానా తలచుకుంటే ఈ పాత్రలో కనిపించడం పెద్ద కష్టమేం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)