ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడియో రిలీజ్ కి రెడీగా 'చిత్రాంగద'

Sat, Jul 09, 2016
'చిత్రాంగద'లో అంజలి
'చిత్రాంగద'లో అంజలి
అంజలి ప్రధాన పాత్రధారిణిగా 'చిత్రాంగద' సినిమా రూపొందింది. అశోక్ దర్శకత్వంలో థ్రిల్లర్ కామెడీ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీధర్ - రెహ్మాన్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అదృశ్య శక్తుల కారణంగా ఒక యువతి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలోనే జరిగింది. ప్రస్తుతం అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో అంజలి పాడిన పాట ఒకటి హైలైట్ అవుతుందని అన్నారు. అనూహ్యమైన మలుపులతో సాగిపోయే ఈ కథ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)