ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇద్దరమ్మాయిలతో రానా!

Sat, Jul 09, 2016
రానా
రానా
'బాహుబలి'తో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న రానా, ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగులో పాల్గొంటున్నాడు. మరో వైపున ఆయనని సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి 'ఘాజీ' రెడీ అవుతోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తరువాత సోలో హీరోగా ఇటు తెలుగులోనూ .. అటు బాలీవుడ్ లోను తన దూకుడు పెంచాలనే ఆలోచనలో రానా వున్నాడు.

ఈ క్రమంలోనే ఆయన తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఆయన సరసన ఒక కథానాయికగా కాజల్ ను ఎంపిక చేశారు. రెండవ కథానాయికగా కేథరిన్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. 'సరైనోడు' సక్సెస్ నుంచి కేథరిన్ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)