ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' క్లైమాక్స్ పూర్తయింది!

Sat, Jul 09, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, నిన్ననే ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది. రెండు పాటలను మాత్రమే తెరకెక్కించవలసి వుంది.

ఒక పాటను హైదరాబాద్ లోను .. మరో పాటను కేరళలోను ప్లాన్ చేశారట. తదుపరి షెడ్యూల్ లో ఈ రెండు పాటలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశాడని అంటున్నారు. కథా కథనాలు .. పాత్రలను మలచిన తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాతో కొరటాల హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)