ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆలోచనలో పడిన 'కత్తిలాంటోడు' టీమ్!

Sat, Jul 09, 2016
చిరంజీవి
చిరంజీవి
వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కుతోన్న 'కత్తిలాంటోడు' చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగును ఇటీవలే మొదలు పెట్టారు. ఈ సినిమాకి హీరోయిన్ ఫైనలైజ్ కాకపోవడంతో, కథలో ఆమె లేని సన్నివేశాలను ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగారు. మొదటి షెడ్యూల్ పూర్తయ్యేలోగా కథానాయికను ఎంపిక చేసుకోవచ్చని అనుకున్నారు.

పక్కా ప్లానింగ్ తో వున్న వినాయక్ .. చిరూపై యాక్షన్ సీన్స్ తో పాటు .. కామెడీ సీన్స్ ను కూడా తెరకెక్కించి ఫస్టు షెడ్యూల్ ను కంప్లీట్ చేశాడు. అయితే ఈ లోగా కథానాయిక కోసం జరిపిన అన్వేషణ ఫలించలేదు. రెండవ షెడ్యూల్ లో చిరంజీవి .. కథానాయికపై కొన్ని సీన్స్ ను షూట్ చేయాలని అనుకున్నారు. కానీ కథానాయిక సమస్య అలాగే ఉండటంతో ఆలోచనలో పడ్డారట. హీరోయిన్ సెలక్షన్ జరిగాక రెండవ షెడ్యూల్ ను స్టార్ట్ చేద్దామా? లేదంటే .. ఆమెకి సంబంధం లేని మిగతా సన్నివేశాలను మొదలెడదామా? అని ఆలోచన చేస్తున్నారట.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)