ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'నాయకి' పట్ల ఇలియానా ఆసక్తి!

Sat, Jul 09, 2016
ఇలియానా
ఇలియానా
త్రిష తొలిసారిగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ చిత్రంగా 'నాయకి' చేసింది. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం త్రిష అభిమానులే కాదు .. తాను కూడా ఎదురుచూస్తున్నానని ఇలియానా అంది. ఇటీవల 'నాయకి' సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను .. టీజర్ ను చూశానని, చాలా ఆసక్తికరంగా అనిపించాయని చెప్పింది.

ఈ టీజర్ లో త్రిష కొత్తగా .. చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ సినిమాలో త్రిష చాలా అద్భుతంగా నటించిందనే విషయం, ఈ టీజర్ తో అర్థమైపోతోంది. త్రిష కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'నాయకి' మిగిలిపోవడం ఖాయమనిపిస్తోందని ఇలియానా అంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తి తనలో కలుగుతోందని చెప్పింది. సాధారణంగా తాను హారర్ చిత్రాలు చూడననీ .. కానీ 'నాయకి' చూడాలనిపిస్తోందని చెప్పుకొచ్చింది.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)