ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రకుల్, తమన్నాలలో ఛాన్స్ ఎవరికి?

Sat, Jul 09, 2016
రకుల్
రకుల్
గోపీచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ తో 'రెబల్' చేసిన నిర్మాతలు .. ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కథా పరంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్టు తెలుస్తోంది. ఒక కథానాయికగా రాశి ఖన్నాను .. మరో కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇక ప్రధాన కథానాయికగా తమన్నాను తీసుకోవాలా? రకుల్ ను ఎంపిక చేయాలా? అనే ఆలోచనలో దర్శకనిర్మాతలు వున్నట్టుగా చెబుతున్నారు. గతంలో 'లౌక్యం' సినిమాలో గోపీచంద్ సరసన రకుల్ నటించింది. ఈ సినిమా అభిమానులను అలరిస్తూ, అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ సెంటిమెంట్ కారణంగా రకుల్ ను తీసుకుంటారా? లేదంటే కొత్తదనం కోసం తమన్నాను ఎంపిక చేసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)