ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సమంతా వెళ్లింది...అమలా పాల్ వస్తోంది!

Sat, Jul 09, 2016
అమలా పాల్
అమలా పాల్
చెన్నయ్ బ్యూటీ సమంతా వెనక్కు తగ్గడం ఇప్పుడు మరో ముద్దుగుమ్మ అమలా పాల్ కి వరంగా మారింది. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడ చెన్నయ్' (ఉత్తర చెన్నయ్) పేరిట ఓ తమిళ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. మూడు పార్టులుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందులో కథానాయికగా సమంతాను తీసుకున్నారు. అయితే, త్వరలో వివాహం చేసుకునే క్రమంలో సమంతా తన ప్రాజక్టులను ఇప్పుడు తగ్గించుకుంటోంది. అందులో భాగంగా 'వడ చెన్నయ్' నుంచి కూడా ఆమె తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో ఆమె స్థానంలో కథానాయికగా అమలా పాల్ ను తీసుకోవడానికి సంప్రదింపులు జరుగుతున్నట్టు తాజా సమాచారం. పెళ్లయినా కూడా అమలా పాల్ కథానాయికగా ఇలా అవకాశాలు సంపాదించుకోవడం విశేషమే!
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)