ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విభిన్నమైన పాత్రలో రాజ్ తరుణ్

Fri, Jul 08, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
యూత్ లో మంచి క్రేజ్ వున్న యువ కథానాయకులలో రాజ్ తరుణ్ ఒకరు. కొత్త కథలను .. సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ ఆయన దూసుకుపోతున్నాడు. అలాంటి విలక్షణ పాత్రలను చేస్తూ వస్తోన్న రాజ్ తరుణ్, త్వరలో తెరపై అంధుడిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సంజనా రెడ్డి దర్శకత్వంలో 'రాజుగాడు' సినిమా చేస్తోన్న రాజ్ తరుణ్, ఆ తరువాత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. సినీ రచయిత అయిన వెలిగొండ శ్రీనివాస్, ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధుడి పాత్రను పోషించడానికి రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామ్ ఒక సినిమాలో అంధుడిగా కనిపించనుంటే, రాజ్ తరుణ్ కూడా ఆ తరహా పాత్రలో మెప్పించనున్నాడన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)