ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 2' క్లైమాక్స్ కి భారీ ఖర్చు!

Fri, Jul 08, 2016
గతేడాది రిలీజైన 'బాహుబలి' చిత్రం క్లైమాక్స్ సన్నివేశాల కోసం 10 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట. ప్రస్తుతం 'బాహుబలి 2'కి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణకి 30 కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నారట. అంటే మొదటి భాగానికంటే 20 కోట్లు ఎక్కువ బడ్జెట్ ను దీనికి కేటాయించారన్న మాట.

ఈ క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ ఆగస్టులో పూర్తవుతుందని అంటున్నారు. ఆ తరువాత నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెడతారని చెబుతున్నారు. మొదటి భాగం సంచలన విజయాన్ని సాధించడం వలన, రెండవ భాగం కూడా ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)