ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రావు రమేష్ కి బన్నీ ఆఫర్!

Fri, Jul 08, 2016
రావు రమేష్
రావు రమేష్
తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలలో విలక్షణమైన నటనను ప్రదర్శించే నటుడిగా రావు రమేష్ కనిపిస్తాడు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. పిల్ల జమీందార్ .. ముకుందా .. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. సన్నాఫ్ సత్యమూర్తి .. సినిమా చూపిస్తమావ సినిమాలు ఆయన నటనా పటిమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి.

రీసెంట్ గా వచ్చిన 'అ ఆ' సినిమా ఆయనలోని నటుడి విశ్వరూపాన్ని చూపింది. దాంతో ఆయనకి వచ్చే అవకాశాలు భారీగా పెరిగిపోయాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తన సినిమాలో ఆయనకి ఒక మంచి పాత్రను బన్నీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విభిన్నమైన .. కీలకమైన పాత్ర ఒకటి వుండటంతో, ఆ పాత్రను రావు రమేష్ తో చేయిద్దామని బన్నీ ఆయనకి ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఆ పాత్ర ఏమిటో .. ఆ పాత్రపై రావు రమేష్ తన మార్క్ ఎలా వేస్తాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)