ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో ట్విస్ట్ ఇచ్చిన సమంతా!

Fri, Jul 08, 2016
సమంతా
సమంతా
నాగచైతన్యతో సమంతా ప్రేమ .. పెళ్లి వ్యవహారం కొన్ని రోజులుగా మీడియాలో షికార్లు చేస్తున్నాయి. డిసెంబర్ లో వీళ్ల పెళ్లి జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. సమంతా కొత్త సినిమాలను అంగీకరించకపోవడం .. అంతకుముందు తీసుకున్న అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తూ ఉండటంతో ఇక వీళ్ల పెళ్లి ఖాయమనే అంతా అనుకున్నారు.

కానీ తాజాగా సమంతా ఒక ట్విస్ట్ ఇచ్చింది. తాను ఏడాది వరకూ సింగిల్ గానే ఉండాలని నిర్ణయించుకున్నాననీ .. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఆమె ఒక మీడియా ప్రతినిధికి స్పష్టమైన సంకేతాలు పంపినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ప్రేమ వ్యవహారం .. పెళ్లి విషయం తానుగా ప్రస్తావించిన సమంతా, త్వరలో పెళ్లి జరగబోతున్నట్టుగా ప్రవర్తించిన సమంతా .. ఒక్కసారిగా ఇలాంటి సంకేతాలు పంపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)