ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఖాకీ డ్రెస్ లో వరుణ్ తేజ్!

Fri, Jul 08, 2016
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్
ఏ హీరో అభిమానులైనా తమ హీరోని ఒక్కసారైనా తెరపై పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూడాలని ముచ్చటపడతారు. ఇక హీరోలు కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు. అలా వరుణ్ తేజ్ కూడా త్వరలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఫ్యాన్స్ ను మెప్పించనున్నాడు.

వరుణ్ తేజ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల 'మిస్టర్' అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఆయన వరుణ్ తేజ్ ను ఒక పోలీస్ ఆఫీసర్ గా చూపించనున్నాడని తెలుస్తోంది. గతంలో శ్రీను వైట్ల 'ఆగడు'లో మహేశ్ ను .. 'బాద్షా' లో ఎన్టీఆర్ ను .. 'బ్రూస్ లీ' లో చరణ్ ను ఖాకీ డ్రెస్ లో చూపించాడు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ .. పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాపై అభిమానులంతా ఆసక్తితో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)