ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆది హీరోగా కన్నడలో 'కార్తికేయ'

Fri, Jul 08, 2016
ఆది
ఆది
'కార్తికేయ' .. నిఖిల్ హీరోగా వచ్చిన ఈ సినిమా తెలుగులో పెద్ద విజయాన్ని సాధించింది. కుమారస్వామి ఆలయం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, దర్శకుడిగా చందూ మొండేటికి .. కథానాయకుడిగా నిఖిల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఈ సినిమాను కన్నడలో .. ఆది కథానాయకుడిగా రీమేక్ చేయాలనే ఆలోచనలో సాయికుమార్ వున్నాడు.

తెలుగుతో పాటు పలు కన్నడ సినిమాల్లో సాయికుమార్ నటించాడు. అక్కడ ఆయనకి మంచి క్రేజ్ ఉంది. అందువల్లనే తన కుమారుడిని కూడా కన్నడలో హీరోగా పరిచయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకు ఆయన 'కార్తికేయ' కథను ఎంచుకున్నాడు. యూత్ కి నచ్చే అన్ని అంశాలు ఈ కథలో ఉండటం వలన, కన్నడలోను ఈ కథ అందరికీ నచ్చుతుందనీ .. ఆదికి తప్పకుండా ఒక హిట్ దొరుకుతుందని ఆయన భావిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)