ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తాజా చిత్రంలో అనుష్క ఇన్వెస్టిగేషన్!

Fri, Jul 08, 2016
అనుష్క
అనుష్క
ఎటువంటి పాత్రనైనా సరే తనదైన శైలిలో అద్భుతంగా పోషించగల అందాలతార అనుష్క తన సుదీర్ఘ కెరీర్లో విభిన్న పాత్రలు పోషించింది. ఆ కోవలో ఇప్పుడు మరో కొత్త తరహా పాత్రను పోషిస్తోంది. 'భాగమతి' చిత్రంలో ఆమె ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. 'పిల్ల జమీందార్' వంటి హిట్ చిత్రాన్ని తీసిన అశోక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
కథానాయిక ప్రధాన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సాంఘిక కథాంశంతోనే సాగుతుందని సమాచారం. ఇందులో ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ మలయాళ నటుడు జయరాం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తాజా షెడ్యూలు నిన్నటి నుంచి జరుగుతోంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో దీనిని ఏకకాలంలో నిర్మిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)