ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Fri, Jul 08, 2016
కీర్తి సురేష్
కీర్తి సురేష్
* తన అభిమాన నటి నయనతార అని చెబుతోంది యువ కథానాయిక కీర్తి సురేష్. "ఆమె అభినయమే కాకుండా ఆమె వ్యక్తిత్వం కూడా నాకు నచ్చుతుంది. హిందీలో పలు అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె ఇక్కడ ఉన్నదానిని వదులుకుని పరిగెత్తలేదు. అది నాకు ఎంతగానో నచ్చింది" అంటోంది కీర్తి.
* రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో సీక్వెల్ (2.0) చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగును వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఎమీ జాక్సన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న సంగతి విదితమే.
* కొండవీటి సత్యం దర్శకత్వంలో 'ప్రత్యక్ష దైవం షిరిడీ సాయిబాబా' పేరిట ఓ భక్తి ప్రధాన చిత్రం రూపొందుతోంది. మచ్చ రామలింగా రెడ్డి సాయిబాబాగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.
* తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటిస్తున్న 'పెళ్లి చూపులు' చిత్రం ఆడియో వేడుక రాత్రి హైదరాబాదులో జరిగింది. ఆడియో సీడీలను నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేయగా, తొలిసీడీని తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)