ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రష్మీ గౌతమ్ అందుకే అలిగిందట!

Thu, Jul 07, 2016
రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్
రష్మీ గౌతమ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'అంతం' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో రష్మీ అలకను ప్రదర్శించి, అందువల్లనే ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే మరో వార్త కూడా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. రష్మీ 'తను వచ్చేనంట' అనే చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా కూడా విడుదలకి ముస్తాబవుతోంది.

ఈ సినిమా తరువాత 'అంతం' సినిమాను రిలీజ్ చేసుకోమని, ఆ సినిమా టీమ్ ను రష్మీ కోరిందట. అయితే 'అంతం' టీమ్ వినిపించుకోకుండా ఈ సినిమాను విడుదల చేశారు. ఈ విషయం కారణంగానే రష్మీ అలక వహించిందని అంటున్నారు. అందువల్లనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకి ఆమె రాలేదని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)