ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గోవుల మధ్య పవన్ కల్యాణ్!

Thu, Jul 07, 2016
పవన్ కల్యాణ్ షూటింగు లేకపోతే ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. ఆయనకి పచ్చదనమన్నా .. ప్రశాంతతన్నా చాలా ఇష్టం. పొలం పనులు .. తోట పనులు చూసుకోవడం మరింత ఇష్టం. అందుకే తన ఫామ్ హౌస్ లో పండ్ల మొక్కలను .. కూరగాయల మొక్కలను ఆయన స్వయంగా సాగుచేస్తూ ఉంటాడు.

అలా ఆయన తన ఫామ్ హౌస్ లో ఉండగా, నిర్మాత శరత్ మరార్ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో గోవుల మధ్య ఆయన ఇలా కనిపించాడట. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ... 'మన గోపాల' ప్రకృతి ఒడిలో గోవుల మధ్య ఇలా కనిపించాడు.. అంటూ కామెంట్ పెట్టారు. తమ సినిమాకి సంబంధించిన విషయాన్ని మాట్లాడటానికి తాను వెళ్లినట్టు ఆయన చెప్పారు. శరత్ మరార్ నిర్మాణంలో .. డాలీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పవన్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా, స్క్రిప్ట్ వర్క్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)