ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ అలా ప్లాన్ చేశాడు!

Thu, Jul 07, 2016
చరణ్
చరణ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కొత్తలుక్ తో కనిపించనున్నాడనే టాక్ రావడంతో, ఫస్టులుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టులుక్ ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడట. అలాగే ఈ సినిమా ఆడియో వేడుకను పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశాడని అంటున్నారు. ఈ విశేషాలతో చరణ్ ఈ సినిమాకి మరింత క్రేజ్ ను తీసుకొచ్చే పనిలో వున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, అక్టోబర్ 7న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)