ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని సుడి తిరిగినట్టే!

Thu, Jul 07, 2016
నాని
నాని
ఫిల్మ్ నగర్లో ఎక్కడ చూసినా నాని సుడి తిరిగిందని చెప్పుకుంటున్నారు. అందువల్లనే ఆయనకి వరుస విజయాలు .. పెద్ద బ్యానర్లలో అవకాశాలు వస్తున్నాయని అనుకుంటున్నారు. నిజానికి కొంత కాలం క్రితం సక్సెస్ లు లేక నాని అయోమయ స్థితిని అనుభవించాడు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' ఆయనకి మాంచి ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఆ ఉత్సాహంతో ఆయన చేసిన భలే భలే మగాడివోయ్ .. కృష్ణగాడి వీర ప్రేమగాథ .. జెంటిల్ మన్ చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. నాని ఎలాంటి పాత్రలనైనా చేయగలడనీ, యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉందనే విషయం స్పష్టమైపోయింది. దాంతో పెద్ద బ్యానర్ల దృష్టి ఆయనపై పడింది. ఆనంది ఆర్ట్స్ .. దిల్ రాజు బ్యానర్లో చేస్తున్న ఆయనని, మరికొన్ని పెద్ద బ్యానర్ల వారు సంప్రదిస్తున్నారట. ఆ బ్యానర్లతో చర్చలు కొనసాగుతున్నాయనీ, కొన్ని ప్రాజెక్టులపై నాని సైన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)