ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ కు జోడీగా రకుల్ కి ఛాన్స్?

Thu, Jul 07, 2016
రకుల్
రకుల్
మహేశ్ బాబు కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో కథానాయికగా పరిణీతి చోప్రాను తీసుకుందామని అనుకున్నారు. చివరి నిమిషంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. మహేశ్ బాబు సరసన పరిణీతిని తీసుకోవడం వలన, సినిమాకి పెద్దగా కలిసొచ్చేది ఏమీ లేదనే అభిప్రాయానికి వాళ్లు వచ్చారని అంటున్నారు.

అందువలన ఇంతవరకూ మహేశ్ జోడీగా చేయని రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. ఈ విషయంపై ఆమెతో మాట్లాడటం .. టెస్ట్ కట్ చేయడం కూడా జరిగిపోయాయని అంటున్నారు. గతంలోనే రకుల్ కి మహేశ్ మూవీలో ఛాన్స్ వచ్చింది గానీ, ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేక ఆ అవకాశాన్ని వదులుకుంది. ఎక్కువ కాలం ఎదురుచూడకుండానే అదృష్టం మరోమారు ఆమె తలుపు తట్టిందన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)