ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్య మనసు మార్చుకున్నాడట!

Thu, Jul 07, 2016
సూర్య
సూర్య
సూర్య కథానాయకుడిగా ఇటీవల '24' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని సూర్య .. విక్రమ్ కుమార్ అనుకుంటున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. కానీ సూర్య ఆ ఆలోచనని విరమించుకున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో 'ఆత్రేయ' పాత్రకి ఉపయోగించిన వీల్ ఛైర్ ను ఒక సంస్థ కి సూర్య విరాళంగా ఇవ్వడమే అందుకు నిదర్శనమని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో 'ఆత్రేయ' పాత్ర వీల్ ఛైర్ కి పరిమితమై ఉంటుంది. ఆ పాత్ర కోసం ఈ వీల్ ఛైర్ ను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన లేకపోవడంతో, 'చండీఘడ్'లోని 'ది స్పైనల్ ఫౌండేషన్'కి సూర్య ఈ వీల్ ఛైర్ ను విరాళంగా ఇచ్చాడు. దాంతో ఈ ఫౌండేషన్ వారు సోషల్ మీడియా ద్వారా సూర్యకి కృతజ్ఞతలు తెలియజేశారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)