ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మాంచి దూకుడు మీదున్నాడు

Thu, Jul 07, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబు ఒక సినిమా పూర్తవుతూ వుండగా .. మరో సినిమాకి సంబంధించిన పనులను సెట్ చేసుకుని సెట్స్ పైకి వెళుతూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య అగ్రదర్శకులకు ఆయన వరుసగా ఓకే చెబుతుండటం చూస్తుంటే, తన దూకుడు పెంచినట్టు అర్థమవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే వంశీ పైడిపల్లికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ చెప్పిన కథ విని, ఆయనకి కూడా ఓకే అనేశాడు. దాంతో పూరీ ఈ సినిమాకి 'జన గణ మన' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశాడు. పనిలో పనిగా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయడానికి మహేశ్ అంగీకరించాడు. ఇలా ఒక సినిమా సెట్స్ పైకి వెళుతూ ఉండగానే, మరో మూడు ప్రాజెక్టులను రెడీగా పెట్టుకోవడం ఆశ్చర్యంగా అనిపించకమానదు. ఇది మహేశ్ ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించే విషయమని చెప్పక తప్పదు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)