ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' టీజర్ కి అదిరే రెస్పాన్స్

Thu, Jul 07, 2016
ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'జనతా గ్యారేజ్' కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న సాయంత్రం ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా ఈ టీజర్ ను కట్ చేశారు. ''బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఒక ఆనవాయితి. ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలముంది .. జనతా గ్యారేజ్ '' అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

యూ ట్యూబ్ లో ఈ టీజర్ విడుదలైన 6 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ లభించాయి. 100 నిమిషాల్లోనే 40 వేలకి పైగా వ్యూస్ లభించాయి. ఇది నిజంగా రికార్డ్ అని చెబుతున్నారు. 'జనతా గ్యారేజ్' సినిమా పట్ల అభిమానులు ఎంత ఆసక్తిగా ఉన్నారనేది ఈ రెస్పాన్స్ తో తెలిసిపోతోందని అంటున్నారు. ఫస్టులుక్ కి .. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో, భారీ హిట్ ఖాయమనే నమ్మకం పెరగడంతో ఈ సినిమా టీమ్ చాలా హ్యాపీగా ఉందట.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)