ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాయిదా ఆలోచనలో అక్కినేని హీరో!

Thu, Jul 07, 2016
ఈ నెల మూడో వారం నుంచి వచ్చే నెలాఖరు వరకు వరుసగా పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. దీంతో వీటితో తమకు పోటీ ఎందుకని చాలా చిన్న సినిమాల నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగ చైతన్య కూడా ప్రస్తుతం అదే ఆలోచిస్తున్నాడట. మలయాళంలో సూపర్ హిట్టయిన 'ప్రేమమ్' చిత్రాన్ని అదే పేరుతో చైతూ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే.

మొదట్లో ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు వరుసగా 'కబాలి', 'బాబు బంగారం', 'జనతా గ్యారేజ్' వంటి పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉండడంతో తన 'ప్రేమమ్' చిత్రాన్ని సెప్టెంబర్ కు వాయిదా వేసుకునే ఆలోచనను చైతూ చేస్తున్నాడని తెలుస్తోంది. కాగా, చైతూ నటించిన మరో సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' మాత్రం ముందు ప్రకటించినట్టుగా ఈ నెలాఖరుకి రిలీజ్ అవుతుందట.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)