ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jul 07, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
* పవన్ కల్యాణ్ రేపు లండన్ పయనమవుతున్నారు. ఈ నెల 9న అక్కడ జరిగే యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) వేడుకల్లో ఆయన పాల్గొంటారు. లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో సుమారు రెండు వేల మంది సమక్షంలో జరిగే ఈ వేడుకల్లో అక్కడి తెలుగు వారిని ఉద్దేశించి పవన్ ప్రసంగిస్తారు. కాగా, పవన్ మొదటిసారిగా లండన్ నగరానికి విచ్చేస్తున్న సందర్భంగా అక్కడి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.
* సుశాంత్ హీరోగా నటిస్తున్న 'ఆటాడుకుందాం రా' సినిమాలో నాటి 'దేవదాసు' సినిమాలో 'పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో' పాటను రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో ఈ పాట ఒక కీలకమైన సందర్భంలో వస్తుందని, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ దీనిని అద్భుతంగా రీమిక్స్ చేశారని హీరో సుశాంత్ చెప్పాడు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ పుకెట్ ఐలాండ్ లో జరుగుతోంది.
* రజనీకాంత్ మేనియా ఒక్క తమిళనాడులోనే కాదు, తమిళులు అధికంగా వుండే మలేసియాలో కూడా ఉంటుంది. అందుకే, ఆయన తాజా చిత్రం 'కబాలి' ప్రీమియర్ షో టికెట్ల కోసం పెద్ద డిమాండ్ ఏర్పడింది. ఈ 21 రాత్రి అక్కడ ఈ సినిమా ప్రీమియర్ వేస్తున్నారు. ఈ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)