ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బిచ్చగాడు' సక్సెస్ తోనే ఆ నిర్ణయం!

Wed, Jul 06, 2016
విజయ్ ఆంటోని
విజయ్ ఆంటోని
ఇటీవల తెలుగులో చిన్న సినిమాలు కొన్ని భారీ విజయాలను అందుకుని ఆశ్చర్యపరిచాయి. ఇక చిన్న అనువాద చిత్రంగా వచ్చిన 'బిచ్చగాడు' ఘనవిజయాన్ని అందుకుని 'ఔరా!' అనిపించుకుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నటించిన విజయ్ ఆంటోనికి ఈ సినిమా అనూహ్యమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇటీవలే 50 రోజులను పూర్తిచేసుకున్న ఈ సినిమా, 20 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ఈ సినిమాకి ఈ స్థాయిలో సక్సెస్ ను తెచ్చిపెట్టిన ప్రేక్షకులందరికీ విజయ్ ఆంటోని ధన్యవాదాలు తెలియజేశాడు. త్వరలోనే తాను నేరుగా తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి, తెలుగులో కథలు వింటున్నానని అన్నాడు. తెలుగులో ఎలాంటి వైవిద్యభరితమైన కథతో వస్తాడో చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)