ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మ్యూజిక్ సిటింగ్స్ లో మెగా హీరో మూవీ

Wed, Jul 06, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గోపీచంద్ మలినేని ఇప్పటికే స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. తాజాగా ఆయన మ్యూజిక్ సిటింగ్స్ ను ఆరంభించాడు.

సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఠాగూర్ మధు .. నల్లమలుపు బుజ్జి నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. 'తిక్క' సినిమా తరువాత సాయిధరమ్ తేజ్ చేస్తోన్న సినిమా ఇది. 'పండగ చేస్కో' సినిమా ద్వారా రామ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన గోపీచంద్ మలినేని, ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ కి కూడా మరో హిట్ ఇస్తాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)