ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అంజలి కొత్త సినిమా మొదలైంది

Wed, Jul 06, 2016
అంజలి
అంజలి
అంజలి తెలుగు అమ్మాయే అయినా ఆమెకి ముందుగా గుర్తింపు లభించింది మాత్రం తమిళంలోనే. అందువలన ఆమె తెలుగుతో పాటు తమిళంలోను చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కొత్తగా ఒక తమిళ సినిమాను అంగీకరించిందనీ, ఈ సినిమాలో కథానాయకుడిగా జై నటిస్తున్నాడనే టాక్ వినిపించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఈ రోజున మొదలైంది.

తాను, జై కలిసి నటిస్తోన్న సినిమా షూటింగు ఈ రోజున మొదలైందనీ .. ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ .. న్యూ బిగినింగ్స్ .. అంటూ అంజలి ట్వీట్ చేసింది. గతంలో అంజలి - జై కలిసి 'జర్నీ' సినిమా చేశారు. ఈ సినిమా తెలుగులోను ఘనవిజయాన్ని అందుకుంది. ఆ సినిమా తరువాత ఈ ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా ఇదే. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఇదొక కారణమైతే, ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారనే ప్రచారం ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరగడానికి మరో కారణమవుతోంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)