ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' గురించి విదీషా

Wed, Jul 06, 2016
విదీషా
విదీషా
తెలుగు తెరపై నిలదొక్కుకోవడానికి తమవంతు ప్రయత్నం చేసిన కథానాయికలలో విదీషా కూడా కనిపిస్తుంది. 'అత్తిలి సత్తిబాబు'లో అల్లరి నరేశ్ జోడీగా నటించిన ఈ సుందరికి, ఈ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈ మధ్య ఆమెని 'జనతా గ్యారేజ్'లో ఒక పాత్ర కోసం ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఏ పాత్ర చేస్తున్నది బయటకి రాలేదు.

తాజాగా ఆమె తన పాత్రను గురించి స్పందించింది. ఈ సినిమాలో తాను మోహన్ లాల్ కి కోడలిగా నటించానని చెప్పింది. తన పాత్రకి ప్రాధాన్యత ఉందనీ, చాలా స్టైలిష్ గా .. మోడ్రన్ గా కనిపిస్తానని అంది. కొరటాల శివ దర్శకత్వంలో ఇంత మంచి పాత్ర లభిస్తుందని తాను ఎంత మాత్రం ఊహించలేదని చెప్పింది. ఎన్టీఆర్ .. మోహన్ లాల్ కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల్లో నటించానని అంది. ఈ ఇద్దరితో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)