ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మారుతి మళ్లీ చిన్నసినిమా చేస్తాడట!

Wed, Jul 06, 2016
మారుతి
మారుతి
మారుతి చిన్న సినిమాలు చేస్తూ .. యూత్ లో క్రేజ్ ను సంపాదిస్తూ వచ్చాడు. తాజాగా ఆయన వెంకటేశ్ - నయనతారలతో 'బాబు బంగారం' సినిమా చేశాడు. ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి చేసిన పెద్ద సినిమాగా 'బాబు బంగారం' గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా తరువాత ఆయన మరే పెద్ద హీరోతో సినిమా చేయనున్నాడా? అనే సందేహం తలెత్తడం సహజం.

అయితే ఆయన మాత్రం ఒక చిన్న సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అలా ఇకపై ఒక పెద్ద సినిమా .. ఆ వెంటనే ఒక చిన్న సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఈ విధంగా చేయడం వలన పెద్దగా టెన్షన్ ఉండదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉంటాడని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)