ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ ఏడాది రవితేజ మూవీ లేనట్టేనా?

Wed, Jul 06, 2016
రవితేజ
రవితేజ
రవితేజ తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి తనదైన దూకుడు చూపిస్తూ వచ్చాడు. వరుస సక్సెస్ లతో మాస్ మహారాజు అనిపించుకున్నాడు. ప్రతి ఏడాది రెండు మూడు సినిమాలు చేసే రవితేజ, ఈ ఏడాది ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మొదలవుతుందని అనుకున్న 'ఎవడో ఒకడు' ఆగిపోవడం, చక్రి దర్శకత్వంలో చేయవలసిన 'రాబిన్ హుడ్' షూటింగ్ మొదలుకాకపోవడం ఈ గ్యాప్ రావడానికి కారణమైంది.

ఇక ఆయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా .. రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ ఇద్దరు దర్శకులు కూడా స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలోనే వున్నారని చెబుతున్నారు. రానున్న ఒకటి రెండు నెలల్లో ఏ దర్శకుడితో కలిసి రవితేజ సెట్స్ పైకి వెళ్లినా, ఆ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావడం కష్టమేనని అనుకుంటున్నారు. అదే జరిగితే .. ఏడాది పాటు ఒక్క సినిమా కూడా చేయకుండా రవితేజ ఉండటం .. ఆయన కెరియర్లో ఇదే మొదటిసారి అవుతుందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)