ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శిరీష్ మూవీలో గెస్టుగా అల్లు అర్జున్!

Wed, Jul 06, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
అల్లు శిరీష్ కథానాయకుడిగా 'శ్రీరస్తు - శుభమస్తు' చిత్రం, త్వరలో విడుదల కాబోతోంది. ఆ తరువాత ఆయన మల్లిడి వేణు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా ద్వారానే మల్లిడి వేణు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్పెషల్ అప్పీరియరెన్స్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

తన సోదరుడి కోసమే కాదు .. దర్శకుడి ఫ్యామిలీతో వున్న సాన్నిహిత్యం కారణంగా కూడా అల్లు అర్జున్ ఇలా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడానికి అంగీకరించాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. సింగిల్ సిటింగ్ లో ఈ కథకి అల్లు అరవింద్ ఓకే చెప్పారట. దీనిని బట్టి ఈ కథ ఎంత బలమైనదో .. ఎంత కొత్తదనంతో వున్నదో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.130.177
Movie News (Latest)