ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగార్జున సెట్లో 'గోవిందా' నియమం!

Wed, Jul 06, 2016
నాగార్జున
నాగార్జున
కొంత గ్యాప్ తరువాత నాగార్జున .. రాఘవేంద్రరావు కాంబినేషన్లో 'ఓం నమో వేంకటేశాయ' అనే భక్తి రసాత్మక చిత్రం తెరకెక్కుతోంది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన 'హథీరామ్ బావాజీ' జీవితచరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్, హైదరాబాద్ .. అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతోంది. ఇక్కడ వేసిన తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం సెట్లో షూటింగ్ జరుగుతోంది.

అందువలన ఈ సినిమాకి పనిచేసే యానిట్ మొత్తానికి రాఘవేంద్రరావు కొన్ని నియమాలు పెట్టారట. అంతా కూడా సంప్రదాయ బద్ధమైన వస్త్రాలను ధరించాలి. ప్రతి ఒక్కరూ నుదుటున తిలకాన్ని ధరించాలి. అలాగే ఎవరూ కూడా పాదరక్షలు ధరించకూడదు. ఇక ప్రతి ఒక్కరూ మరొకరిని 'గోవిందా' అనే పిలవాలి. ఇలా రాఘవేంద్రరావు ఈ సినిమా సెట్లోని వాతావరణం పవిత్రంగా ఉండేలా చూస్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో షూటింగ్ జరుపుతున్నట్టుగా చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)