ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్రామీణ యువకుడిగా సూర్య!

Wed, Jul 06, 2016
సూర్య
సూర్య
'24' చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన సూర్య, త్వరలో పోలీస్ ఆఫీసర్ గా 'సింగం 3'తో పలకరించనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయనతో పనిచేయడానికి ఇద్దరు దర్శకులు రెడీగా వున్నారు. ఒకరు రంజిత్ అయితే .. మరొకరు ముత్తయ్య. తమిళంలో గ్రామీణ నేపథ్యంలో గల కథలను తెరకెక్కించే దర్శకుడిగా ముత్తయ్యకి మంచి క్రేజ్ ఉంది. తన గత చిత్రాల మాదిరిగానే, ఈసారి సూర్యతోను ఆయన గ్రామీణ నేపథ్యంలో ఒక సినిమా చేయనున్నాడట.

ఈ సినిమాలో సూర్యకి తండ్రిగా రాజ్ కిరణ్ నటిస్తాడని అంటున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం ప్రధానంగా ఈ సినిమా రూపొందనుందని చెబుతున్నారు. గ్రామీణ నేపథ్యంలో సెంటిమెంట్ తో పాటు యాక్షన్ సమపాళ్లలో ఉంటుందని అంటున్నారు. అయితే సూర్య 'సింగం 3' షూటింగు పూర్తయిన తరువాత, ముందుగా రంజిత్ తో చేస్తాడా? లేదంటే ముత్తయ్యతో కలిసి సెట్స్ పైకి వెళతాడా? అనేది తెలియాల్సి ఉంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)