ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుష్కపై పోస్ట్ పెట్టిన దర్శకేంద్రుడు!

Wed, Jul 06, 2016
రాఘవేంద్రరావు
రాఘవేంద్రరావు
ఇది ఒక ఆసక్తికరమైన అంశం. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే అవకాశం కోసం ప్రతి హీరోయిన్ ఎదురుచూస్తుంది. ఆయన సినిమాలో నటిస్తే తన స్థాయి పెరగడంతో పాటు, మరింత గ్లామరస్ గా చూపిస్తారన్న ఆశ హీరోయిన్లలో వుంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా అందాల అనుష్క తన సినిమాలో ఎప్పుడు నటిస్తుందా? అని రాఘవేంద్రరావు ఎదురుచూశారట.

దీని గురించి ఆయన తాజాగా ఫేస్ బుక్ లో వెల్లడిస్తూ, "ఎటువంటి పాత్రనైనా అద్భుతంగా చేయగల ఆర్టిస్టులలో అనుష్క ఒకరు. బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వుంది. తనకి నా సినిమాలో తగిన క్యారెక్టర్ వస్తే పనిచేయాలని ఎప్పటినుంచో చూస్తున్నాను. ఇన్నాళ్లకి 'ఓం నమో వేంకటేశాయ' సినిమాలో అది జరిగింది. తన కెరీర్లో మొదటిసారిగా ఆమె భక్తురాలిగా నటిస్తోంది. ఆ పాత్రలో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఇందులో నాగార్జునకి అనుష్క జంటగా నటించడం లేదు" అంటూ దర్శకేంద్రుడు పోస్ట్ పెట్టారు. మొత్తానికి రాఘవేంద్రరావు కాంప్లిమెంట్స్ అందుకున్న అనుష్క లక్కీ హీరోయిన్నే!
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)