ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాశి ఖన్నా అసాధ్యురాలే!

Tue, Jul 05, 2016
రాశి ఖన్నా
రాశి ఖన్నా
అందాల కథానాయికలు పాటల్లో మెరిసేంత సున్నితంగా ఉంటారని అనుకుంటే పొరపాటే, ఒక్కోసారి వాళ్లు చూపే ధైర్యం .. చేసే సాహసం ఔరా! అనిపించకమానవు. రీసెంట్ గా రాశి ఖన్నా అలాంటి సాహసమే చేసింది. 'ఆటా' వేడుకలో పాల్గొనడానికి రాశి ఖన్నా అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.

సాధారణంగా అలా వెళ్లినప్పుడు సమయం దొరికితే ఎవరైనా షాపింగ్ కి వెళతారు. కానీ రాశి ఖన్నా 'స్కై డైవింగ్' కి వెళ్లింది. 14000 అడుగుల ఎత్తు నుంచి 'స్కై డైవింగ్' చేసేసింది. ఇలా చెబితే నమ్మరనే .. ఆ వీడియోను ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేసింది. 'స్కై డైవింగ్' చేయాలనేది తన చిరకాల కోరికనీ, అది ఇంత కాలానికి ఇలా తీరిందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అంత ఎత్తునుంచి దూకడం చాలా ఎంగ్జైటింగ్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది. రాశి ఖన్నా అందగత్తె మాత్రమే కాదు .. అసాధ్యురాలు కూడానన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)