ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు సినిమా ఆడియో వేడుకకి శ్రీదేవి!

Tue, Jul 05, 2016
శ్రీదేవి
శ్రీదేవి
తమన్నా ప్రధానమైన పాత్రగా 'అభినేత్రి' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, షూటింగుపరంగా చివరిదశకి చేరుకుంది. ఈ హారర్ మూవీలో ప్రభుదేవా .. సోనుసూద్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

తెలుగులో ఈ సినిమాకి కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 15న విజయవాడలో జరపాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకి ఆయన శ్రీదేవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టు చెబుతున్నారు. ఈ ఆడియో రిలీజ్ కి రావడానికి శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. శ్రీదేవి వస్తే .. అందరి దృష్టిని ఈ సినిమా తనవైపు తిప్పుకోవడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపించనున్న తమన్నా, ఈ సినిమా సక్సెస్ పై భారీగా ఆశలు పెట్టుకుందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)