ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'అకీరా' ట్రైలర్ అదుర్స్

Tue, Jul 05, 2016
సోనాక్షీ సిన్హా
సోనాక్షీ సిన్హా
మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రగా 'అకీరా' చిత్రం రూపొందుతోంది. మురుగదాస్ హిందీలో తెరకెక్కిస్తోన్న మూడవ చిత్రం ఇది. గతంలో ఆయన అక్కడ చేసిన గజినీ .. హాలిడే సినిమాలకిగాను ఆయనకి మంచి క్రేజ్ వచ్చింది. అందువలన ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన సోనాక్షీని, ఈ సినిమాలో కొత్త కోణంలో మురుగదాస్ చూపించాడు. ఆమెపై చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ పై ట్రైలర్ ను కట్ చేసి వదిలారు. సోనాక్షీ చాలా పెర్ఫెక్ట్ గా ఫైట్స్ చేసింది. అలాగే ఎమోషన్ ను సైతం అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరగడం .. ఈ సినిమాతో సోనాక్షీ కి మరింత క్రేజ్ పెరగడం ఖాయం అనుకోవచ్చు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో అవినీతి పరుడైన ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం. సెప్టెంబర్ 2న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)