ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'భక్త కన్నప్ప' లేనట్టేనా?

Tue, Jul 05, 2016
విష్ణు
విష్ణు
చాలా కాలం క్రితం బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు కథానాయకుడిగా 'భక్త కన్నప్ప' చిత్రం తెరకెక్కింది. కథ .. కథనాలు .. మాటలు .. పాటలు ఈ సినిమాకి ఘనవిజయాన్ని సంపాదించి పెట్టాయి. అలాంటి ఈ కథను మళ్లీ తెరకెక్కించనున్నట్టు మంచు విష్ణు ప్రకటించాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుందనీ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని ఆయన అన్నాడు.

ఆ తరువాత మోహన్ బాబు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఈ సినిమా విష్ణు సొంత బ్యానర్ పై రానుందని చెప్పారు. కానీ ఆ తరువాత అందుకు సంబంధించిన సందడి ఎక్కడా కనిపించడం లేదు. ఈ సినిమా గురించిన సమాచారమూ లేదు. దాంతో ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయా? లేదంటే ఆ ఆలోచనని పక్కన పెట్టేశారా? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతోంది. విష్ణు క్లారిటీ ఇస్తే తప్ప ఈ సందేహానికి తెరపడదు.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)