ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతార మూవీ టైటిల్ ఖరారు

Tue, Jul 05, 2016
నయనతార
నయనతార
కోలీవుడ్ అగ్రకథానాయికల జాబితాలో నయనతార పేరు ముందుగా కనిపిస్తుంది. వరుస సినిమాలతో .. భారీ విజయాలతో ఒక రేంజ్ లో ఆమె అక్కడ దూసుకుపోతోంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక హారర్ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాకి దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి 'దొర' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది. అయితే రీసెంట్ గా 'జాక్సన్ దొరై' అనే తమిళ సినిమాను ఇక్కడ 'దొర' టైటిల్ తో రిలీజ్ చేశారు. కాబట్టి నయనతార 'దొర' సినిమాకి తెలుగు టైటిల్ ను ఆలోచిస్తున్నారట. ఆ మధ్య తమిళంలో 'మాయ' టైటిల్ తో నయనతార చేసిన సినిమా, తెలుగులో 'మయూరి'గా విజయం సాధించింది. మరి 'దొర' సినిమా కూడా అదే జాబితాలో చేరుతుందో లేదో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)